TCS Q2 Results: టీసీఎస్‌ లాభం ₹11వేల కోట్లు.. బైబ్యాక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

TCS Q2 Results: షేర్ల బైబ్యాక్‌కు టీసీఎస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.17వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. 15 శాతం ప్రీమియంతో ఈ షేర్లు కొనుగోలు చేయనుంది. 

Published : 11 Oct 2023 19:00 IST

TCS Q2 Results | ముంబయి: దేశంలో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తొలి ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి గానూ కంపెనీ రూ.11,342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 8.7 శాతం వృద్ధి నమోదైంది. అలాగే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 7.9 శాతం వృద్ధితో రూ.59,692 కోట్లుగా నమోదైంది.

ఒక్కో షేరుకు రూ.9 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని టీసీఎస్‌ బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఇందుకు రికార్డు డేట్‌ను అక్టోబర్‌ 19గా కంపెనీ పేర్కొంది. అలాగే రూ.17వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఒక్కో షేరును రూ.4,150 చొప్పున కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. గడిచిన ఆరేళ్లలో టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ చేపట్టడం ఇది ఐదో సారి. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం క్షీణించి రూ.3609 వద్ద ముగిసింది. ప్రస్తుత విలువతో పోలిస్తే బైబ్యాక్‌లో 15 శాతం ప్రీమియానికి టీసీఎస్‌ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.

రైతులకు త్వరలో గుడ్‌న్యూస్‌.. కిసాన్‌ సమ్మాన్‌ కింద మరో ₹2 వేలు!

తగ్గిన ఉద్యోగులు

రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6 వేల మేర తగ్గినట్లు టీసీఎస్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 30 నాటికి ఉద్యోగుల సంఖ్య 6.08 లక్షలుగా ఉన్నారని పేర్కొంది. ఇందులో 35 శాతం మంది మహిళలేనని పేర్కొంది. గడిచిన 12 నెలలుగా కంపెనీలో వలస రేటు 14.9 శాతంగా ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని