సైబర్‌ దాడులు.. మనపై ఎక్కువే

అమెరికా, బ్రిటన్‌ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్‌’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్‌ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

Published : 05 May 2024 02:25 IST

ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారత్‌
గతేడాది 7.9 కోట్ల దాడులు
సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రాంపై గురి

దిల్లీ: అమెరికా, బ్రిటన్‌ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్‌’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్‌ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కాలంగా అంతర్జాతీయ ఫిషింగ్‌ దాడులు 60% పెరిగాయని తెలిపింది. 2023 జనవరి-డిసెంబరులో కనిపించిన 200 కోట్ల బ్లాక్డ్‌ ఫిషింగ్‌ లావాదేవీల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ప్రకారం..

  • భారత్‌లో టెక్‌ రంగం(33%) అన్ని రంగాల కంటే ఎక్కువగా సైబర్‌ దాడులకు గురైంది.
  • ఆర్థిక, బీమా రంగాల్లోనూ 2022తో పోలిస్తే సైబర్‌ దాడులు 393% పెరిగాయి. ఈ రంగాలు డిజిటల్‌ ప్లాట్‌ఫారాలపై ఆధారపడడం అధికమవ్వడం, సైబర్‌నేరగాళ్లకు కలిసొస్తోంది.
  • తయారీ రంగంలో 2022, 2023 మధ్య ఫిషింగ్‌ 31% పెరిగింది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటుండడంతో ఆయా రంగాలు దాడులకు ‘బలహీన లక్ష్యాలు’గా మారాయి.
  • 2023లో ఫిషింగ్‌ దాడులకు అమెరికా ఎక్కువగా బలైంది. మొత్తం దాడుల్లో 55.9% ఈ దేశంపైనే జరగ్గా.. బ్రిటన్‌పై 5.6%, భారత్‌పై 3.9% (7.9 కోట్ల దాడులు) చోటు చేసుకున్నాయి.
  • భారత్‌లో డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అమలు వల్ల ఇటువంటి దాడులను నిలువరించడానికి సహకారం లభించినట్లయింది.
  • 2023లో అత్యంతగా అనుకరించిన బ్రాండ్లలో మైక్రోసాఫ్ట్‌ కనిపించింది. ఆ తర్వాతి స్థానంలో అడోబ్‌, అమెజాన్‌, గూగుల్‌ ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా దాడుల బారినపడ్డ సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రాం (7,92,883 ఫిషింగ్‌ దాడులు) ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఫేస్‌బుక్‌ (5,32,243), వాట్సప్‌ (3,78,968) ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని