ఎయిరిండియా క్యాబిన్‌ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు

దేశీయ మార్గాల్లో క్యాబిన్‌ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్‌ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది.

Published : 05 May 2024 02:24 IST

దిల్లీ: దేశీయ మార్గాల్లో క్యాబిన్‌ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్‌ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. తమ విమానాల్లో కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్‌, ఫ్లెక్స్‌ విభాగాలుగా టికెట్‌ ధరలు ఉంటాయని, ఇందులో వేర్వేరు ప్రయోజనాలు, నిబంధనలు అమలవుతాయని ఎయిరిండియా ప్రతినిధి శనివారం వివరించారు. ఈ ప్రకారం..

  • ఎయిరిండియా దేశీయ విమానాల్లో గరిష్ఠంగా 25 కేజీల వరకు క్యాబిన్‌ లగేజీకి ఉచితంగా అనుమతి ఉండేది. తాజా మార్పులతో కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్‌ టికెట్‌పై 15 కిలోల లగేజీనే ఉచితంగా క్యాబిన్‌లో అనుమతిస్తారు. ఫ్లెక్స్‌ టికెట్‌పై 25 కిలోల క్యాబిన్‌ లగేజీ తీసుకెళ్లొచ్చు.
  • బిజినెస్‌ తరగతి ప్రయాణికులు కూడా దేశీయ మార్గాల్లో కేబిన్‌ లగేజీగా 25-35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
  • ఇతర విమానయాన సంస్థల్లోనూ క్యాబిన్‌ లగేజీగా 15 కిలోలనే ఉచితంగా అనుమతిస్తున్నారు.

ఫ్లెక్స్‌ ప్రయోజనాలు ఇలా: దిల్లీ-ముంబయి టికెట్‌ ధరనే తీసుకుంటే, కంఫర్ట్‌ ప్లస్‌, ఫ్లెక్స్‌ విభాగాల మధ్య తేడా రూ.1000 వరకు ఉంటుంది. అయితే 10 కిలోల అదనపు క్యాబిన్‌ లగేజీకి వీలుతో పాటు, ప్రయాణతేదీ మార్పు, లేదా క్యాన్సిలేషన్‌కు ఎటువంటి రుసుము ఉండదని, వీటి విలువ రూ.9000 వరకు ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని