రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్‌ ఐడియా యత్నాలు!

ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్‌ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్‌ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం.

Published : 05 May 2024 02:23 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్‌ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్‌ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. రుణదాతల కన్సార్షియానికి ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంక్‌గా వ్యహరించనుందని చెబుతున్నారు. దశల వారీగా రెండేళ్లలో ఈ రుణాలు వొడాఫోన్‌ ఐడియాకు చేరతాయని, చర్చలు జరుగుతున్నందున వివరాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల పేర్లు మాత్రం వెల్లడి కాలేదు. ఈ వార్తలపై వొడాఫోన్‌ ఐడియా, బ్యాంక్‌లు స్పందించలేదు. గత నెలలో ఎఫ్‌పీఓ (మలి విడత పబ్లిక్‌ ఇష్యూ) ద్వారా రూ.18,000 కోట్ల నిధుల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా ప్రయత్నించగా, 6.36 రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని