Jay kotak: సినీ నటితో ఉదయ్‌ కోటక్ కుమారుడి వివాహం

Jay kotak- Aditi Arya: ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ తనయుడు జై కోటక్‌, సినీ నటి అదితి ఆర్య వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి.

Updated : 09 Nov 2023 20:03 IST

ముంబయి: కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ ఉదయ్‌ కోటక్ కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్‌ కోటక్‌ తనయుడు జై కోటక్‌ (Jay kotak), మాజీ మిస్‌ ఇండియా అదితి ఆర్య (Aditi Arya) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం ఈ వివాహ వేడుక జరిగింది. వధూవరులెవరూ వివాహనికి సంబంధించిన చిత్రాలు పంచుకోనప్పటికీ.. సోషల్‌ మీడియాలో ఈ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ వివాహ వేడుకకు ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ దంపతులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

జై కోటక్‌, అదితీ ఆర్య నిశ్చితార్థం మొదలు వివాహం వరకు మొదటి నుంచీ ఇరు కుటుంబాలు గోప్యంగానే ఉంచుతున్నాయి. వాస్తవానికి గతేడాదే వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎవరూ బయటపెట్టలేదు. గతంలో వీరు ఇరువురూ పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద ఉన్న చిత్రాలు బయటకొచ్చినప్పుడే ఊహాగానాలువచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే నెలలో జై కోటక్ స్వయంగా నిశ్చితార్థం విషయాన్ని బయటపెట్టారు. తనకు కాబోయే భార్య యేల్‌ యూనివర్సిటీ నుంచి విజయవంతంగా ఎంబీఏ పట్టా పొందిందంటూ ఎక్స్‌లో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

డిస్నీ ఇండియా కొనసాగుతుంది.. సీఈఓ క్లారిటీ

జై కోటక్‌ కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన డిజిటల్‌ ఫస్ట్‌ మొబైల్‌ బ్యాంక్‌ కోటక్‌ 811కి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న అదితి ఆర్య.. గతంలో ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ అనే ప్రొఫెషనల్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌లో రీసెర్చి అనలిస్ట్‌గా పనిచేశారు. 2015లో మిస్‌ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. తెలుగులో పూరీ జగన్నాథ్‌, కల్యాణ్‌ రామ్‌ కాంబోలో వచ్చిన ‘ఇజం’లో నటించారు. అలాగే, రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ సహా పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు