Vivo T2 Pro: కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో వివో కొత్త ఫోన్‌.. వివరాలు ఇవే..!

Vivo T2 Pro details: వివో తన టీ20 ప్రో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సెప్టెంబర్‌ 29 నుంచి ఈ ఫోన్‌ విక్రయానికి రానుంది.

Published : 22 Sep 2023 13:21 IST

Vivo T2 Pro launched |  ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో (Vivo) కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. వివో టీ2 ప్రో 5జీ (Vivo T2 Pro 5g) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో కర్వడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తుండడం గమనార్హం. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ ఈ ఫోన్‌ ధరెంత? ఫీచర్లేంటి? వంటి వివరాలు చూద్దాం..

వివో టీ2 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా పేర్కొంది. సెప్టెంబర్‌ 29 నుంచి విక్రయానికి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌, వివో వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోళ్లపై రూ.2వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఎక్స్ఛేంజీపై వెయ్యి రూపాయలు అదనపు బోనస్‌ ఇస్తున్నారు.

భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్ 15 అమ్మకాలు.. లాంచ్‌ ఆఫర్లివే

వివో టీ2 ప్రో 5జీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ ప్యానెల్‌ ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ డిస్‌ఫ్లే అమర్చారు. ఈ ఫోన్‌ మందం 7.36 ఎంఎం మాత్రమే. బరువు కూడా 175 గ్రాములు. ఇందులో ఆక్టాకోర్‌ డిమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 13తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 64 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4600 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని