logo

అడవి ఆముదం గింజలు తిని ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

కుమురం భీం జిల్లా వాంకిడి మండలం చిన్నపుల్లార గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు బుధవారం ఆముదం గింజలు తిని అస్వస్థతకు గురయ్యారు.

Published : 02 Feb 2023 02:22 IST

ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

వాంకిడి, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లా వాంకిడి మండలం చిన్నపుల్లార గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు బుధవారం ఆముదం గింజలు తిని అస్వస్థతకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంటి వద్ద పక్కపక్కనే ఉండే చిన్నారులు ఆడుకుంటూ మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అడవి ఆముదం గింజలను తిన్నారు. దీంతో తొడసం జంగు(3), తొడసం జానుబాయి(2), సుర్పం భూమిక (5), సుర్పం కీర్తి(3), కుర్సెంగ నాగవళ్లి(4), మడావి శంకర్‌ (8), చిక్రం నందు(4)లకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చిన్నారులను ఆటోలో వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారులకు ప్రథమ చికిత్సలు అందించి.. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చిన్నారులకు చికిత్సలు అందించారు. జిల్లా అదనపు పాలనాధికారి చాహత్‌ బాజ్‌పాయి, డీఎంహెచ్‌వో ప్రభాకర్‌లు ఆసుపత్రిని సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. చౌపన్‌గూడ సర్పంచి అన్నిగ ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని