logo

తనిఖీల్లో నగదు పట్టివేత

ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 26 Apr 2024 16:55 IST

ఎదులాపురం: ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మావల బైపాస్ వద్ద తనిఖీల సందర్భంగా ఇంద్రవెల్లికి చెందిన కల్లూరి అశ్విన్‌ను తనిఖీ చేయగా ఈ మేరకు నగదు బయటపడినట్లు తెలిపారు. రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్ళేప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని లేనట్లయితే స్వాధీనం చేసుకుంటామని మావల ఎస్సై వంగ విష్ణువర్ధన్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని