logo

అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు

అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని  ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్  సీఐ విజేందర్ హెచ్చరించారు.

Published : 29 Mar 2024 11:48 IST

ఎదులాపురం :  అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని  ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్  సీఐ విజేందర్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలు అనంతరం 32 కేసులు నమోదు చేసి 22 మందిని అరెస్టు చేసినట్లు  ఆయన తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, మద్యం గొలుసు దుకాణాల నుంచి రూ.3.10 లక్షల విలువైన 180 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బైండోవర్ ఉల్లంఘనకు పాల్పడిన  మొహమ్మద్ హఫీజ్, సుధాంలకు నోటీసులు జారీ చేశామన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం తరలిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని