logo

మాడుగులను అగ్రగామిగా నిలుపుతా

మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 02:13 IST

బండారు సత్యనారాయణమూర్తికి హారతులు

చీడికాడ, న్యూస్‌టుడే: మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. వైకాపా పాలనలో నిరాదరణకు గురైన వ్యవసాయం, సాగునీటి రంగాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అడవి అగ్రహారం, తునివలస, వింటిపాలెం, దండిసురవరం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడితో కలిసి ప్రచారం చేశారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌, తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని