icon icon icon
icon icon icon

Bonda: ఆ ఇద్దరు అధికారులపై ఫిర్యాదు చేస్తాం: బొండా ఉమా

వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధానా ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 06 May 2024 15:51 IST

విజయవాడ: వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న చొరవ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేకపోవడం వెనుక మర్మం ఏమిటో తెలియాలన్నారు. 

‘‘వెల్లంపల్లి శ్రీనివాస్‌ పోస్టింగ్‌ వేయించాడని విజయవాడ నార్త్‌ ఏసీపీ ప్రసాద్‌, నున్న సీఐ దుర్గాప్రసాద్‌లు వైకాపా తొత్తులుగా పనిచేస్తున్నారు. తను చెప్పినట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయలేదని ఎస్టీ సర్వేయర్‌పై వైకాపా కార్పొరేటర్‌ గణేశ్‌ భర్త దాడి చేయించాడు. ఈ ఘటనలో వైకాపా నేతల మీద నామమాత్రపు కేసులు పెట్టి, బాధితులపైనా ఎదురు కేసులు నమోదు చేశారు. గతంలో సదురు అధికారులపై ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలి. అధికార పార్టీ పట్ల అంత మెతక వైఖరి దేనికో బహిర్గతం చేయాలి’’అని బొండా ఉమా డిమాండ్‌ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. ఇద్దరు అధికారుల బాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కొత్త డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img