logo

నిర్లక్ష్యపు జాడలో.. నీరెరగని కాలువలు

కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు.

Published : 19 Apr 2024 04:04 IST

కందుకూరు వద్ద పీఏబీఆర్‌ కాలువ లైనింగ్‌ తీరు

కాలువల్లో నీరు పారినపుడే వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో వ్యవసాయానికి కాలువలే ఆయువుపట్టు. అయితే వైకాపా పాలనలో కాలువల నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు. పిచ్చి మొక్కలతోను, చెట్లు పెరిగి కాలువలు రూపు కోల్పోతున్నాయి. పీఏబీఆర్‌, పేరూరు జలాశయం, మిడ్‌పెన్నార్‌ జలాశయం కాలువలను ఐదేళ్లుగా పట్టించుకోలేదు. వీటిలో నీరు పారటమే గగనమైంది. ఈ రెండు జలాశయాల కాలువల కింద వందల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. లైనింగ్‌ లేక చాలాచోట్ల కట్టలు బలహీనంగా మారుతున్నాయి. పీఏబీఆర్‌ కాలువ ఉరవకొండ, రాప్తాడు, ధర్మవరం, శింగనమల నియోజకవర్గాల్లో అనేక గ్రామాలకు సాగునీరు అందిస్తుంది. ఈ కాలువ పరిధిలో అనేక చెరువులను నింపేందుకు ఇదొక్కటే ఆధారం. భూగర్భజలాల పెరుగుదలకూ ఉపయోగపడుతుంది. పేరూరు జలాశయం కుడికాలువ పరిధిలో కనగానపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మిడ్‌పెన్నార్‌ డ్యాం నుంచి దక్షిణ కాలువ ద్వారా గార్లదిన్నె అనంతపురం రూరల్‌, బీకేఎస్‌, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాలకు సాగునీరు అందితోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ కాలువను ఆధునికీకరించారు. ఇదేళ్లుగా ఆధునికీకరణకు నోచుకోక కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జలాశయాల్లో నీరున్నా కాలువకు వదిలే పరిస్థితే లేదంటే ఇది కచ్చితంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యమే.. ఆయకట్టు రైతులకు ఇదంతా వేదన భరితమే. 

ఈనాడు, అనంతపురం

రాప్తాడు మండలం కందుకూరు వద్ద మట్టితో కప్పేసిన షట్టర్లు..

గార్లదిన్నె మండలం మర్తాడు వద్ద మిడ్‌పెన్నార్‌ దక్షిణకాలవ కట్ట దుస్థితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు