logo

ప్రాథమిక రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరగనున్న పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామని  ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు.

Published : 21 Jan 2023 05:52 IST

అభ్యర్థులు అరగంట ముందుగానే రావాలి   

ఎస్పీ రిషాంత్‌రెడ్డి

మాట్లాడుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరగనున్న పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష పకడ్బందీగా నిర్వహిస్తామని  ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 12,196 మంది అభ్యర్థులు పరీక్ష హాజరు కానున్నారని అందులో పురుషులు 9,719, మహిళలు 2,477 మంది ఉన్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు వరకు పరీక్ష జరగనుందని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పారు. అభ్యర్థులు కనీసం అరగంట ముందుగా కేంద్రానికి రావాలన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావద్దని కోరారు. కాపియింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోద చేసి జీవితాంతం పోలీసు నియామకాల్లో ప్రవేశం ఉండదని హెచ్చరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, జిరాక్స్‌ కేంద్రాల మూసేయాలని నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఏఎస్పీ జగదీష్‌ పర్యవేక్షణలో సుమారు 452 మందిని బందోబస్తుగా ఏర్పాటు చేశామన్నారు. ఏఎస్పీ జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు