logo

సగం నెల గడిచినా.. వేతనాలందని ఎస్వీయూ ఉద్యోగులు

నెలలో సగం రోజులు గడిచినా నేటికీ తమ ఖాతాల్లో జీతాలు జమకాకపోవడంపై ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది.

Published : 16 Apr 2024 01:32 IST

తిరుపతి (బైరాగిపట్టెడ): నెలలో సగం రోజులు గడిచినా నేటికీ తమ ఖాతాల్లో జీతాలు జమకాకపోవడంపై ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది. వర్సిటీలోని పలు విభాగాల్లో 500 మందివరకు శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. నేటికీ జీతాలు అందకపోవడంపై బోధన, బోధనేతర ఉద్యోగులు ఇదేమి ఖర్మ అంటూ ఆవేదన చెందుతున్నారు. పదవీవిరమణ పొందినవారు 700 మందిపైగా ఉన్నారు. వీరిలో వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఉన్నవారు అనేకమంది ఉండగా తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిగో జీతం అదిగో వేతనం అంటూ పాలకులు ఆశలు రేపుతున్నారే తప్ప ఎంతకూ జమకావడం లేదని వాపోతున్నారు. మరికొందరైతే చేతిలో చిల్లిగవ్వలేక ఎవరినీ అడగలేక ఇబ్బందిపడుతున్నారు. ఈ అంశంలో పాలకుల నిర్లక్ష్యంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్రమ నియామకాలు, పాలకపక్ష పెద్దల ఎన్నికల ప్రచారాల్లో చూపుతున్న శ్రద్ధ జీతాలు చెల్లించడంలో లేదంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని