logo

నయానా.. భయానా?

గ్రామ వాలంటీర్లను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలులో ఉండగా  వైకాపా నేతలు తమ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఒత్తిడి పెంచుతున్నారు.

Published : 16 Apr 2024 01:35 IST

కీలకనేత ఆదేశాలతో వాలంటీర్లపై ఒత్తిడి
మూకుమ్మడిగా రాజీనామాలు

రాజీనామా పత్రాలు చూపుతున్న వాలంటీర్లు

చంద్రగిరి: గ్రామ వాలంటీర్లను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలులో ఉండగా  వైకాపా నేతలు తమ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈసీ ఆదేశాలతో పలువురు వాలంటీర్లపై వేటుపడటంతో అధికార పార్టీ కార్యక్రమాలకు వారు దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో చంద్రగిరి నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వాలంటీర్లతో రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ దిగువ స్థాయి నాయకులకు హుకుం జారీచేశారు. దీంతో వారు రాజీనామా చేయకుంటే భవిష్యత్తులో ఇబ్బందిపడతారంటూ నయానా భయానా ఒప్పిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో అంగీకరించిన కొందరిని వైకాపా నేతలే దగ్గరుండి మండల కార్యాలయాలకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2,135 మంది ఉండగా ఇప్పటివరకు 852 మంది వాలంటీర్లు వ్యక్తిగత కారణాలు చూపుతూ ఎంపీడీవోలకు రాజీనామా పత్రాలు ఇచ్చారు. ఎలాంటి విచారణ లేకుండానే వెనువెంటనే అధికారులు ఆమోదముద్ర వేసి పంపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని