logo

ఎర్రటి ఎండ.. ఏదీ రూయా అండ

రుయాలో రోగుల కష్టాలకు పరిష్కారం కరవైంది. ఇక్కడ వెయ్యిమంది పైగా ఇన్‌పేషెంట్లు నిత్యం చికిత్స పొందుతున్నారు.

Published : 16 Apr 2024 01:39 IST

మిట్ట మధ్యాహ్నం రోగిని తరలిస్తూ..

రుయాలో రోగుల కష్టాలకు పరిష్కారం కరవైంది. ఇక్కడ వెయ్యిమంది పైగా ఇన్‌పేషెంట్లు నిత్యం చికిత్స పొందుతున్నారు. పరీక్షల నిమిత్తం ఒక వార్డు నుంచి మరో వార్డుకు స్ట్రెచర్‌పై సిబ్బంది తీసుకువెళ్తుంటారు. ఎండల తీవ్రత నుంచి రోగులు ఇబ్బంది పడకుండా మొబైల్‌ స్ట్రెచర్‌ వాహనంలో తీసుకువెళ్లాల్సి ఉండగా అవి మూలకుచేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడి గతుకుల రోడ్లు ఎర్రటి ఎండలోనే రోగులను సోమవారం మధ్యాహ్నం తరలిస్తూ కనిపించారు. ఉన్నతాధికారులు పర్యవేక్షించి వాహనం రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

ఈనాడు, తిరుపతి

అలంకారప్రాయంగా మొబైల్‌ వాహనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని