logo

20న చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.

Published : 18 Apr 2024 02:37 IST

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు సర్వేపల్లిలో జరిగే సమావేశంలో, సాయంత్రం సత్యవేడులో జరిగే సభలో ప్రసంగిస్తారు. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూడూరు అభ్యర్థి పాశిం సునిల్‌కుమార్‌ తెలిపారు.


గోడ మీద పిల్లిలా..

వైకాపా నేతలతో అంటకాగుతున్న మెప్మా అధికారి

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే నగరపాలక కార్యాలయంలో మెప్మా విభాగంలో ఓ అధికారి ‘గో’డ మీద ‘పి’ల్లిలా వ్యవహరిస్తున్నారు. వైకాపా నేతల మాటలే ఆయనకు వేదవాక్కు. వైకాపా నేతలు నిర్వహించే బహిరంగ సభలకు డ్వాక్రా మహిళల్ని తరలించడంలో ఈయన దిట్ట. సభలకు హాజరు కాకుంటే మెప్మా ఆర్‌పీలు, సీవోలు డ్వాక్రా సభ్యుల ద్వారా రూ.100 అపరాధ రుసుము విధిస్తారు. గతంలో నియోజకవర్గ వైకాపా నేత ఒకరు సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట నూతన దుస్తులు పంపిణీ చేయగా.. ఆ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల్ని పంపించి ఏర్పాట్లు చేసి.. అధికార పార్టీ నేతల మెప్పు పొందారు. గతంలో తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తూ ఓ పార్టీ నాయకురాలికి అనుకూలంగా వ్యవహరించి.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహానికి గురి కావడంతో చిత్తూరుకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వైకాపా నేతల సేవలో తరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. డ్వాక్రా మహిళలతో నిండిపోతుంది. మెప్మా అధికారిగా పొరుగుసేవలపై పనిచేస్తున్న ఆయనకు అర్హత లేకపోయినా.. విధుల నిర్వహణ కోసం నగరపాలక సంస్థ అధికారులు ఓ కారు కేటాయించారు. నగరపాలక ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో.. అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని