logo

తుంచేసిన కల.. కూత వినబడేదెలా

దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం.

Published : 18 Apr 2024 06:28 IST

ఈనాడు, కాకినాడ: దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. 57.21 కి.మీ పొడవైన ఈ మార్గానికి 2012లో రూ.2,125 కోట్ల అంచనా వ్యయంతో మంజూరుచేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా అచ్చంగా రూ.525 కోట్లు. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.2.69 కోట్లు. ప్రభుత్వ తీరు చూసి కేంద్రం ఆసక్తి చూపలేదు. వైనతేయ, వశిష్ట, గౌతమి నదులపై వంతెనల పనులు ఏళ్లతరబడి సాగు..తున్నాయి. భూసేకరణ, వంతెన ఇతరత్రా పనులు కొలిక్కిరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని