logo

సేవా కేంద్రాలు.. ముమ్మరంగా లావాదేవీలు

పొదుపు చేయడంపై మహిళలకు అవగాహన పెరుగుతోంది. సంఘాల్లో చేరి నిత్యం లక్షలాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరికి అందుబాటులో ఖాతాదారుల సేవ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో మహిళలు తమంతట

Published : 15 Jan 2022 00:52 IST

న్యూస్‌టుడే, పరిగి: పొదుపు చేయడంపై మహిళలకు అవగాహన పెరుగుతోంది. సంఘాల్లో చేరి నిత్యం లక్షలాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరికి అందుబాటులో ఖాతాదారుల సేవ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో మహిళలు తమంతట తాము వెళ్లి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. డబ్బులు ఖాతాల్లో జమచేసుకోవడం, అవసరమైన సమయంలో తిరిగి తీసుకోవడం చేస్తున్నారు. గతంలో ఏ చిన్న అవసరం వచ్చినా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.  ప్రస్తుతం పరిగి మండలంలో 37 పంచాయతీల పరిధిలో స్త్రీ నిధి నుంచి వివిధ ప్రాంతాల్లో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పొదుపు మహిళలతోపాటు ఇతరులు నిత్యం సుమారు రూ.8లక్షల మేరకు లావాదేవీలు జరుపుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు నెలకు దాదాపు రూ.10వేల వరకు కమీషన్‌ పొందుతున్నారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా, సురక్ష బీమా, అటల్‌ పింఛన్‌ వంటి పథకాలతో పాటు నెలనెలా పొదుపు డబ్బులు డిపాజిట్లు, రుణాలు చెల్లించడం, కొత్త ఖాతాలను ప్రారంభించడం కూడా వీటి ద్వారానే చేపడుతున్నారు.

సమాఖ్య ఆధ్వర్యంలో....: పరిగి నియోజకవర్గంలోని 148 పంచాయతీల పరిధిలో 4,276 పొదుపు సంఘాలు ఉండగా 46,419 మంది సభ్యులున్నారు. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 4,034 సంఘాలు వివిధ బ్యాంకలు ద్వారా రూ.114.70కోట్లు రుణం పొందడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,666 సంఘాలు రూ.70.64కోట్లు రుణంగా పొందాయి. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో లావాదేవీల నిర్వహణ మరింత పెరిగేందుకు ఆస్కారం కలుగుతోంది. ఇదే క్రమంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరికొన్ని నూతనంగా బ్యాంక్‌ కరస్పాడెంట్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఇటీవలే నిర్వాహకులకు అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో వీరు కూడా గ్రామీణులకు సేవలు అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని