logo

34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు

కరోనా పేరుతో దాదాపు ఏడాది పాటు.. ఎంఎంటీఎస్‌లను నడపని దక్షిణమధ్య రైల్వే.. తర్వాత అరకొరగా సర్వీసులను ప్రారంభించింది. పూర్తి స్థాయి(రోజుకు 121) సర్వీసులను పెంచకుండా కేవలం 76తో సరిపెడుతూ వస్తోంది. వాటిలో దాదాపు సగానికి

Published : 21 May 2022 07:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పేరుతో దాదాపు ఏడాది పాటు.. ఎంఎంటీఎస్‌లను నడపని దక్షిణమధ్య రైల్వే.. తర్వాత అరకొరగా సర్వీసులను ప్రారంభించింది. పూర్తి స్థాయి(రోజుకు 121) సర్వీసులను పెంచకుండా కేవలం 76తో సరిపెడుతూ వస్తోంది. వాటిలో దాదాపు సగానికి శని, ఆదివారాల్లో కత్తెరేసింది. గత వారాంతం మాదిరే ఈ వారాంతమూ 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను తగ్గించేసింది. ఏ సమయంలో నడిచే రైలును రద్దు చేశారో తెలియని గందరగోళాన్ని ద.మ. రైల్వే ప్రతి వారాంతాల్లో సృష్టిస్తోంది. రైలు నంబర్లు ప్రకటించి.. ఏ మార్గంలో ఎన్ని రద్దు చేస్తుందో మాత్రమే ప్రకటించింది.

రైళ్ల రద్దు ఇలా..

● లింగంపల్లి - హైదరాబాద్‌ మధ్య 18 సర్వీసులు

● ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య మొత్తం 14 సర్వీసులు

● సికింద్రాబాద్‌ - లింగంపల్లి మధ్య రెండు సర్వీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని