రండి రండి.. దయచేయండి
శివార్లలో మినీ ఫామ్‌హౌస్‌లు
ఈనాడు, హైదరాబాద్
కీసర సమీపంలోని మైసిరెడ్డిపల్లిలో నిర్మించిన ఫామ్‌హౌస్
నగర జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి దూరంగా ప్రతి ఒక్కరూ కొంత సమయమైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. వారాంతాల్లోనో.. కనీసం నెలకోసారైనా ఫామ్‌హౌస్, రిసార్టుకు వెళ్లి ప్రశాంతంగా గడపాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. ఒక్కరోజు ఆనందం కోసం భారీగా ఖర్చు చేయలేని వేతన జీవులు, చిరుద్యోగులకు ఇది సాధ్యమేనా అన్నదే పెద్ద ప్రశ్న. ఇలాంటి వారినే నగర శివార్లు, ఔటర్ వెలుపల నిర్మించిన ‘మినీ ఫామ్‌హౌస్’లు రమ్మని పిలుస్తున్నాయి. తక్కువ అద్దెతో అందరికీ అనువుగా అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. పచ్చని పంట పొలాల పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న ఇల్లు, ఈత కొలను, విశ్రాంతి తీసుకునేందుకు ఏసీ సౌకర్యంతో కూడిన గది, ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు.
అద్దె రూ.5 వేల లోపువి సైతం
వారాంతాల్లో రిసార్టులు, ఫామ్‌హౌస్‌లకు వెళ్లే సంస్కృతి గత కొన్నేళ్లలో నగరంలో బాగా పెరిగింది. ఇదంతా కాస్త ఖరీదు వ్యవహారం. చిరుద్యోగులు, దిగువ మధ్యతరగతి వారు కుటుంబం, స్నేహితులతో సరదాగా రిసార్టు, పెద్ద ఫామ్‌హౌస్‌లకు వెళ్లాలంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. ప్రధానంగా ఇలాంటి వారికే తక్కువ ధరల్లో రిసార్టులు, ఫామ్‌హౌస్‌లను తలపించేలా మినీ ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. వాటిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. గది అద్దె, సహాయకుడికి భత్యం అన్ని కలిపితే రోజుకు రూ.5 వేలకు మించకుండా ధర నిర్ణయిస్తున్నారు. భోజనం వంటివి సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
పదుల సంఖ్యలో ఏర్పాటు
ప్రస్తుతం ఉప్పల్- భువనగిరి, అల్వాల్- సిద్దిపేట, ఇబ్రహీంపట్నం తదితర మార్గాల్లో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. వీటికి డిమాండ్ కూడా పెరుగుతోంది. కొందరు నిర్వాహకులు గ్యాస్ స్టవ్, వంట సామగ్రి వంటి సదుపాయాల్ని అందిస్తున్నారు. వంట సరకులు తీసుకెళ్తే అక్కడే వంట సిద్ధం చేసుకునేలా ఏర్పాట్లు ఉంటున్నాయి. నెలలో కనీసం పది రోజులకుపైనే అద్దెకు ఇస్తున్నామని మైసిరెడ్డిపల్లిలోని ఫామ్‌హౌస్ నిర్వాహకుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. రిసార్టులకు వెళ్లేంత స్థోమత లేని వారిని ఆకట్టుకునేందుకు వీటిని నిర్మించినట్లు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
-
Politics News
BJP: భాజపా బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించిన బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!