logo

ఆక్రమణదారులపై చట్టప్రకారం చర్యలు

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 3800 చదరపు గజాల స్థలం ఆక్రమణలపై ప్రభుత్వం కేసు నమోదు చేసి అభియోగ పత్రం దాఖలు చేసిన నేపథ్యంలో చట్టప్రకారం చర్యలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టులో ఈ

Published : 10 Aug 2022 02:45 IST

ఉస్మానియా భూముల కబ్జాలపై  హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 3800 చదరపు గజాల స్థలం ఆక్రమణలపై ప్రభుత్వం కేసు నమోదు చేసి అభియోగ పత్రం దాఖలు చేసిన నేపథ్యంలో చట్టప్రకారం చర్యలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టులో ఈ వివాదం ఉన్నందున ఇక ఇక్కడ విచారణ చేపట్టడం సబబుకాదని పేర్కొంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 8000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించుకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ పి.రమణారావు 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ తులసి కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ తమకు చెందని  3800 చదరపు గజాల స్థలం విక్రయించిందని, దీనిపై పోలీసు కేసు నమోదైందన్నారు. దర్యాప్తు అనంతరం ఈకేసులో అభియోగ పత్రం దాఖలు చేశామన్నారు. అయిదుగురిని నిందితులుగా పేర్కొన్నామన్నారు.వాదనలు విన్న ధర్మాసనం చట్టప్రకారం ఇప్పుడు చర్యలు కొనసాగుతున్నందున తాము ఇక్కడ విచారణ చేపట్టడం సరికాదంది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రయోజన పిటిషన్‌లోని అంశాలకు చెందినవి మాత్రమేనంది. చట్టప్రకారం విచారణ కొనసాగించడానికి వీలుగా పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని