logo

చేపల మార్కెట్లు చేరువయ్యేనా?

నగరవాసులకు చేపల మార్కెట్ల కొరత వేధిస్తోంది. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో నాణ్యమైన చేపల కోసం ఇబ్బందులు తప్పట్లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆధునిక మార్కెట్లు నిర్మించినప్పటికీ.. సరిపోవడం లేదు.

Published : 05 Oct 2022 03:23 IST

మల్లాపూర్‌లో సిద్ధమైన చేపల మార్కెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: నగరవాసులకు చేపల మార్కెట్ల కొరత వేధిస్తోంది. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో నాణ్యమైన చేపల కోసం ఇబ్బందులు తప్పట్లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆధునిక మార్కెట్లు నిర్మించినప్పటికీ.. సరిపోవడం లేదు. తమ ప్రాంతాల్లోనూ మార్కెట్లను నిర్మించాలని పౌరులు కోరుతున్నారు.

ప్రశ్నార్థకంగా రాంనగర్‌: ముషీరాబాద్‌ పరిధి రాంనగర్‌ చేపల మార్కెట్‌  ఆదివారం వస్తే జనం కిక్కిరిసి ఉంటారు. అలాంటి మార్కెట్‌లో అపరిశుభ్రత తాండవిస్తుంది. చేపలను భద్రపరిచే డబ్బాల్లోని నీరు, వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రజల డిమాండ్‌కు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇటీవల స్పందించారు. మార్కెట్‌ను సమీపంలోని మూడు ఎకరాల ఖాళీ స్థలానికి మార్చాలని జోనల్‌ అధికారులు సూచించడంతో.. మంత్రి, ఎమ్మెల్యే, మత్స్యశాఖ కమిషనర్‌, వ్యాపారులు.. ఆ ప్రాంతాన్ని సందర్శించారు. అత్యాధునిక భవనతోపాటు పార్కింగ్‌, ఇతర సౌకర్యాలు కల్పించవచ్చని నిర్ణయించారు. కానీ స్థలం ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ ససేమిరా అంటోంది. దీంతో పనులు అటకెక్కినట్లయింది.

అక్కడ విజయవంతంగా..

బేగంబజార్‌ చేపల మార్కెట్‌ను జీహెచ్‌ఎంసీ మూడంతస్తుల్లో  నిర్మించి.. ఇటీవల ప్రారంభించింది.  హోల్‌సేల్‌, చిల్లర విక్రయాలు, వ్యర్థాల శుద్ధి కేంద్రం, ఇతర సౌకర్యాలతో మార్కెట్‌ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. కేపీహెచ్‌బీ ఫేజ్‌-5లో నిర్మించిన మార్కెట్‌ సైతం మెరుగైన సేవలందిస్తోంది. త్వరలోనే కూకట్‌పల్లి, మల్లాపూర్‌లో చేపల మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. మల్లాపూర్‌ మార్కెట్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఇంజినీర్లు తెలిపారు. ఇలా డివిజన్‌కు ఒకటి చొప్పున మార్కెట్లను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts