logo

Hyderabad: ఏడుగురి కోసం ‘మినీ థియేటర్‌’.. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి చూసేలా!

ప్రేక్షకులు పెద్దగా రాని థియేటర్‌లో.. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి నచ్చిన సినిమాను చూస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు అలాంటి అనుభూతి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందొచ్చు..

Updated : 19 Nov 2022 09:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రేక్షకులు పెద్దగా రాని థియేటర్‌లో.. కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి నచ్చిన సినిమాను చూస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు అలాంటి అనుభూతి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందొచ్చు.. కేవలం సినిమాలే కాదు క్రికెట్‌ మ్యాచ్‌లు, పెళ్లి వీడియోలు, బర్త్‌డే పార్టీలు, ఆత్మీయ సమావేశాలు, ఓటీటీ సినిమాలు ఇలా ఇంకెన్నో.. నగరంలోని ప్రజలకు ‘స్టార్‌ ట్రాక్‌’ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. ఇళ్లు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలు తదితర ప్రాంతాల్లో విలాసవంతమైన థియేటర్లను డిజైన్‌ చేసే ఈ సంస్థ.. సికింద్రాబాద్‌లోని కార్యాలయంలో ఈ ‘డెమో’ థియేటర్‌ అనుభవాన్ని కల్పిస్తోంది. సుమారు 143 అంగుళాల స్క్రీన్‌, 15 స్పీకర్‌ సిస్టమ్‌లు, విలాసవంతమైన రిక్లైనర్స్‌, భద్రత దృష్ట్యా సెక్యూరిటీ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. డెమో అనుభూతిని పొందాలనుకునేవారు కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చి నచ్చిన ఓటీటీలు, సినిమాలు చూడవచ్చు. మొత్తం ఏడుగురు ఒకేసారి కూర్చొని మినీ థియేటర్‌ అనుభవాన్ని పొందొచ్చు. రోజు ఉదయం వేళ నాలుగు గంటల పాటు ఇందులో గడిపేందుకు రూ.1500 ఛార్జీ వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే రూ.1700 వరకు ఛార్జీ ఉంటుంది. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయంలో బుక్‌ చేసుకోవాలంటే రూ.1700, వారాంతాల్లో అయితే రూ.1900 వరకు ఛార్జీ అవుతోంది. నచ్చిన వారు ఆర్డర్‌ ఇస్తే వారింట్లోనూ ఈ తరహా డిజైన్లు ఏర్పాటు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని