logo

టీటా సభ్యులకు నియామక పత్రాలు

టీటా (తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులకు   హోం మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ నియామక పత్రాలు అందజేశారు.

Published : 01 Dec 2022 02:37 IST

టీ హబ్‌లో అందజేస్తున్న హోంమంత్రి మహమూద్‌ అలీ, చిత్రంలో సందీప్‌ మఖ్తల

రాయదుర్గం: టీటా (తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌) గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులకు   హోం మంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ నియామక పత్రాలు అందజేశారు. రాయదుర్గం టీహబ్‌లో టీటా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు రాణా ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శులు అశ్విన్‌ చంద్ర వలబోజు, నవీన్‌ చింతల, కోశాధికారి రవి లెల్లలతోపాటు రాష్ట్ర కార్యదర్శులుగా ఎంపికైన వినయ్‌ తూము, దీపికా జోషి, ఓవర్సీస్‌ కోఆర్డినేటర్‌ ఎంఎన్‌ఆర్‌ గుప్తా, మలేషియా, యూకే చాప్టర్ల అధ్యక్షులు పోతరాజు, హితేష్‌ బిక్కుమల్ల, జిల్లాల కార్యదర్శులు.. జనగాం- శ్రావణి బాసరాజు, ఖమ్మం- క్రాంతి, సిరిసిల్లా- సంతోష్‌ రెడ్డి, మెదక్‌- సాయిరాదాస్‌పల్లి, విద్యార్థి విభాగం కార్యదర్శులుగా ఎన్నికైన చినోల మాధవ్‌, అభిలాష్‌ రంగినేని, సింధూజ వంగ, నిత్యరాజ్‌ కొంపల్లి, సంయుక్త కార్యదర్శులు కౌకుంట్ల మేఘన, గోలివర్ణిత, రాళ్లపల్లి రోహిత్‌, మనీష్‌ నియామక పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని