logo

ఒత్తిడికి లోనైనప్పుడు షాపింగ్‌ చేస్తా: గవర్నర్‌

ఒత్తిడికి లోనైనప్పుడు ఉపశమనం కోసం కొన్ని సందర్భాల్లో షాపింగ్‌ చేస్తానని, చీరలు కొనుగోలు చేస్తానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

Updated : 07 Dec 2022 05:32 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహూకరించేందుకు గవర్నర్‌ తమిళిసై కొనుగోలు చేసిన చీర

శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌టుడే: ఒత్తిడికి లోనైనప్పుడు ఉపశమనం కోసం కొన్ని సందర్భాల్లో షాపింగ్‌ చేస్తానని, చీరలు కొనుగోలు చేస్తానని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తెలిపారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఈనెల 4న ఇండియన్‌ సిల్క్‌ గ్యాలరీ పేరుతో ప్రారంభమైన వస్త్ర ప్రదర్శనను మంగళవారం ఆమె సందర్శించారు. స్టాళ్లు ఏర్పాటు చేసిన వారిలో ఐదుగురు చేనేత కార్మికులను సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఉన్నత చదువులకు కెనడా వెళ్లినప్పుడు చీరలే ధరించానని, ఎలాంటి కుట్టులేని ఆరున్నర అడుగులున్న చీరను బాగా ధరించారని అక్కడివారు మెచ్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. శీతాకాల విడిదికి ఈనెల ఆఖరువారంలో నగరానికి విచ్చేస్తున్న రాష్ట్రపతిద్రౌపది ముర్ముకు బహూకరించేందుకు ధర్మవరానికి చెందిన రామకృష్ణ అనే చేనేత కార్మికుడి నుంచి చీరను కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని