logo

ఆ వెబ్‌సైట్లు బంద్‌

మానవ అక్రమ రవాణా, వ్యభిచార నిర్వహణకు అడ్డుకట్ట వేయడంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ మరో అడుగు ముందుకేసింది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కాల్‌గర్ల్‌ వెబ్‌సైట్లను తొలగించారు.

Published : 05 Feb 2023 03:35 IST

4 కాల్‌గర్ల్‌ సైట్ల తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణా, వ్యభిచార నిర్వహణకు అడ్డుకట్ట వేయడంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ మరో అడుగు ముందుకేసింది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న కాల్‌గర్ల్‌ వెబ్‌సైట్లను తొలగించారు. ఇతర దేశాల నుంచి నిర్వహించే సైట్లను అడ్డుకోవడం సాంకేతికంగా కష్టమయ్యేది. కమిషనరేట్‌లోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ (సీవోఈ) సాయంతో 4 వెబ్‌సైట్లను పూర్తిగా తొలగించినట్లు శనివారం ప్రకటించారు. మరోవైపు అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో ఇప్పటివరకూ 54 మందిని అరెస్టు చేయగా, తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఇతర రాష్ట్రాల యువతులను నగరానికి తీసుకొచ్చి దందా నడిపిస్తున్నారు. కేసులో మొదటిసారి పట్టుబడ్డ 18 మంది దేశవ్యాప్తంగా 14,190 మంది యువతులను రొంపిలోకి దింపినట్లు తేలడం సంచలనం రేపింది. ఆ 18 మందిపై పీడీ యాక్టు ప్రయోగించారు. నిందితులను ఇప్పటివరకూ దాదాపు 60 వేల మందికిపైగా విటులు సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు కాగా రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం ఉన్నారు. నిందితులకు డ్రగ్‌ డీలర్లతోనూ సంబంధాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు