వీధి కుక్కలు.. కాకిలెక్కలు
ఫిబ్రవరి 19న అంబర్‌పేట ఆరో నంబరు రోడ్డులో నాలుగేళ్ల బాలుడు శునకాల దాడితో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం.. ప్రతి రోజూ నగరంలోని ఏదో ఓ ప్రాంతంలో కుక్కకాటు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
కార్పొరేటర్ల కమిటీని మభ్యపెడుతున్న బల్దియా
ఈనాడు, హైదరాబాద్
ఫిబ్రవరి 19న అంబర్‌పేట ఆరో నంబరు రోడ్డులో నాలుగేళ్ల బాలుడు శునకాల దాడితో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం.. ప్రతి రోజూ నగరంలోని ఏదో ఓ ప్రాంతంలో కుక్కకాటు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ పారిశుద్ధ్య కార్మికుడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా గురువారం అత్తాపూర్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలుడిపై 6 కుక్కలు దాడి చేశాయి. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారుల్లో స్పందన లేదు. వీధి కుక్కలకు అన్నం పెట్టే వారిపై, మాంసం దుకాణాల యజమానులపై నిందలు మోపి చేతులు దులిపేసుకుంటున్నారు.
చలించని అధికార యంత్రాంగం..
బల్దియాకు రోజూ వీధి కుక్కల సమస్యపై 500 ఫిర్యాదులొస్తుంటే వాటిలో 10 శాతం కూడా పరిష్కరించట్లేదు. కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేశామని, వాటిని పట్టుకెళ్లడం కుదరదని చెబుతున్నారు. ఆపరేషన్లు చేస్తే పిల్లలు ఎలా పుడుతున్నాయని స్థానికుల ప్రశ్నకు సమాధానం లేదు. నగరంలో 5 జంతు సంరక్షణ కేంద్రాల ఆధ్వర్యంలో ఎంతమంది సిబ్బంది ఎన్నింటిని పట్టుకుంటున్నారు.. ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు.. ఎన్నింటికి రేబిస్ టీకాలు వేశారు.. ఎంత ఖర్చవుతోందని ప్రశ్నిస్తే.. బల్దియా పశువైద్య విభాగం ముఖ్య అధికారి డాక్టర్ వకీల్ సమాధానాన్ని దాటవేశారని ఉప్పల్ కార్పొరేటర్ రజితారెడ్డి తెలిపారు. కార్పొరేటర్లతో వేసిన కమిటీ అడిగే ప్రశ్నలకు అధికారులు జవాబు ఇవ్వట్లేదన్నారు.
* రాజ్యాంగం ప్రకారం.. జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలు నేరపూరితమైనవని జంతు సంరక్షకురాలు డాక్టర్ శశికళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2019లో 3.92 లక్షల కుక్కలున్నట్లు పశుసంవర్ధకశాఖ స.హ. చట్టం కింద జవాబు ఇచ్చిందని, కానీ బల్దియా అధికారులు మాత్రం గతంలో ఒక్క హైదరాబాద్‌లోనే 6.5 లక్షలున్నట్లు, ఇప్పుడు వాటి సంఖ్య 5.7 లక్షలని చెబుతుండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
జీహెచ్‌ఎంసీ గణాంకాల ప్రకారం..
5,70,729 నగరంలో వీధి కుక్కలు
సంతాన నివారణ శస్త్ర చికిత్సలు జరిగినవి 4,01,089 (70.3 శాతం)
శస్త్రచికిత్సలు చేయాల్సినవి.. 1,69,640
ఏడాదికి అయ్యే ఖర్చు.. రూ.15 కోట్లు
రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
కాటేదాన్, న్యూస్‌టుడే: గ్రామ సింహాలు మరోమారు రెచ్చిపోయాయి. రెండేళ్ల బాలుడిపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే... తేజస్వినీ నగర్‌లో ఉండే మౌనిక, శ్రీహరిలకు రెండేళ్ల బాబు శ్రీహాన్ ఉన్నాడు. గురువారం ఉదయం ఇంటిముందు బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు గుర్తించి వీధి కుక్కలను కర్రలతో వెళ్ల గొట్టారు. తీవ్రగాయాలకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tejas Aircraft: వాయుసేన చేతికి తొలి తేజస్ ట్విన్ సీటర్ విమానం
-
Kiran Abbavaram: రతిక లాంటి భార్య.. కిరణ్ అబ్బవరం ఏమన్నారంటే..?
-
Nara Lokesh: అప్పటివరకూ లోకేశ్‌ను అరెస్టు చేయొద్దు: సీఐడీకి హైకోర్టు ఆదేశం
-
Sky bus: స్కైబస్లో కేంద్రమంత్రి గడ్కరీ టెస్టు రైడ్.. త్వరలో ఆ బస్సులు భారత్‌కు!
-
DK Aruna: తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్: డీకే అరుణ
-
Stock Market: నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 19,450 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ