logo

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ) ప్రచారంలో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకుని సద్గురు రమేష్‌ జీ, గురుమా తదితరులు భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును కలిశారు.

Updated : 24 Mar 2023 18:13 IST

క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ) ప్రచారంలో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకుని సద్గురు రమేష్‌ జీ, గురుమా తదితరులు భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును కలిశారు. విశ్వశాంతి, మానవజాతి సంక్షేమం కోసం క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సద్గురు రమేష్‌ జీ రాష్ట్రపతికి వివరించారు. ప్రపంచ శాంతి, అందరూ ఒకటేనన్న భావనను పెంపొందించాలనేది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మనిషిలో వచ్చే ప్రతికూల ఆలోచనలను దారి మళ్లించి, మనస్సును సానుకూల అంశాలు, ప్రార్థనలతో నింపడం ద్వారా పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తాయని, అవి విశ్వశాంతి స్థాపనకు దోహదం చేస్తాయని సద్గురు రమేష్‌జీ అన్నారు. ఈ సత్‌ సంకల్పంలో భాగంగానే సీటీసీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. స్వామి పూర్ణానంద జ్ఞాన బోధలతో ఆధ్యాత్మికవేత్తగా మారిన రమేష్‌జీ హఠ యోగ, కుండలిని యోగ, క్రియ యోగాలను సాధన చేశారు. హైదరాబాద్‌ సమీపంలో జన్వాడ వద్ద పూర్ణ ఆనంద ఆశ్రమం ప్రారంభించి సేవలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని