logo

తీపి మిఠాయి కాదు.. అంగూర్‌

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఉంటున్న రైతు కె.అంజిరెడ్డి భిన్నంగా ద్రాక్షతోటలు పెంచుతున్నారు. ద్రాక్ష పంటల విస్తీర్ణం పెంచేందుకు, మరింతమంది రైతులకు అంగూర్‌ ద్వారా వచ్చే...

Published : 28 Mar 2023 02:28 IST

న్యూస్‌టుడే, మహేశ్వరం:  రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఉంటున్న రైతు కె.అంజిరెడ్డి భిన్నంగా ద్రాక్షతోటలు పెంచుతున్నారు. ద్రాక్ష పంటల విస్తీర్ణం పెంచేందుకు, మరింతమంది రైతులకు అంగూర్‌ ద్వారా వచ్చే లాభాలను వివరించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు స్థానికంగా అంజిరెడ్డి పొలాన్ని ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం అక్కడి రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ ‘మాణిక్‌ చమన్‌’ రకం ద్రాక్ష తియ్యగా ఉంటుందని తెలుసుకుని ఆరేళ్ల నుంచి దాన్నే పండిస్తున్నా. తిన్నవారంతా తీపి మిఠాయి కంటే ఎక్కువ అంటున్నారు. ఎకరాకు గరిష్టంగా 22 టన్నుల దిగుబడి వస్తోందని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని