logo

ఎంఎన్‌జేలో మరో 300 పడకలు

నవాబ్‌ మెహిదీ నవాజ్‌ జంగ్‌(ఎంఎన్‌జే) ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌(నాంపల్లి-రెడ్‌హిల్స్‌)కు అనుబంధంగా 300 పడకల సామర్థ్యంతో కార్పొరేట్‌కు దీటుగా, అత్యాధునిక హంగులతో అరబిందో ఆంకాలజీ బ్లాక్‌(భవనం) నిర్మితమైంది.

Published : 29 Mar 2023 02:21 IST

ప్రారంభానికి సిద్ధమవుతున్న అరబిందో బ్లాక్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: నవాబ్‌ మెహిదీ నవాజ్‌ జంగ్‌(ఎంఎన్‌జే) ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌(నాంపల్లి-రెడ్‌హిల్స్‌)కు అనుబంధంగా 300 పడకల సామర్థ్యంతో కార్పొరేట్‌కు దీటుగా, అత్యాధునిక హంగులతో అరబిందో ఆంకాలజీ బ్లాక్‌(భవనం) నిర్మితమైంది. ప్రస్తుతం ఎంఎన్‌జే కాన్సర్‌ ఆసుపత్రిలో 450 పడకలున్నాయి. కొత్త బ్లాక్‌ అందుబాటులోకి వస్తే 750 పడకలుగా మారనుంది. క్యాన్సర్‌ రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలనే సత్‌సంకల్పంతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌(ఏపీఎఫ్‌) వారు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా రూ.80 కోట్లతో ఇప్పుడున్న ఆసుపత్రికి అనుబంధంగా సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొత్త భవనాన్ని సిద్ధం చేశారు. ఇది త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది.

ఎనిమిది అంతస్తుల్లో..

నూతన భవనాన్ని 8 అంతస్తుల(సెల్లార్‌, లోయర్‌ గ్రౌండ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు అయిదు అంతస్తులు)తో ఏర్పాటు చేశారు. దిగువ అంతస్తు(-1)లో రెండు రేడియాలజీ విభాగాలున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌కు కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిసెప్షన్‌, క్యాజువాలిటీ, 12 కన్సల్టేషన్‌ గదులు, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లున్నాయి. మొదటి అంతస్తులో 10 వార్డ్‌ రూమ్‌లు, 16 పడకల సామర్థ్యంతో పీడియాట్రిక్‌ ఐసీయూ, 18 పడకల సామర్థ్యంతో ఐసీయూ ఉన్నాయి. రెండో అంతస్తులో 10 వార్డ్‌ రూమ్‌లు, 18 పడకల సామర్థ్యం కలిగిన మహిళా ఐసీయూ, రెండు ఐసోలేషన్‌ గదులున్నాయి. మూడో అంతస్తులో 10 వార్డ్‌ రూమ్‌లు, 18 పడకల సామర్థ్యం గల రెండు పురుషులు/ఐసీయూ ఉన్నాయి. నాలుగో అంతస్తులో ఆపరేషన్‌(పోస్ట్‌ ఆప్‌) థియేటర్లు, 8 బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ గదులున్నాయి. అయిదో అంతస్తులో విశాలమైన సభామందిరంతోపాటు హెచ్‌ఏవీసీ సిస్టమ్స్‌ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని