logo

దాచుకోమని చెప్పి.. దోచుకెళ్లారు

దారినపోయే వృద్ధులకు జాగ్రత్తలు చెప్పి..వ్యూహం ప్రకారం తిరిగి వారే దోపిడీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు ఎస్సై, బాధితులు, తెలిపిన వివరాల ప్రకారం..

Published : 02 Apr 2023 03:12 IST

వృద్ధుల నుంచి బంగారం, నగదు చోరీ

కొత్తూరు, న్యూస్‌టుడే: దారినపోయే వృద్ధులకు జాగ్రత్తలు చెప్పి..వ్యూహం ప్రకారం తిరిగి వారే దోపిడీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు ఎస్సై, బాధితులు, తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం, చేగూరు పంచాయతీ వెంకమ్మగూడకు చెందిన గుండాల మల్లమ్మ(65) మల్లయ్య(72) దంపతులు మార్చి 31న కొత్తూరు ఎస్‌బీఐ బ్యాంకులో రూ.2,000 డ్రా చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తిమ్మాపూరులోని చేగూరు చౌరస్తాలో దిగారు. ఆటోలు లేకపోవడంతో కాలినడకన బయలుదేరారు. ఫాతిమాపూర్‌ శివారు దాటగానే బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు వారి వివరాలు తెలుసుకున్నారు. దొంగలుంటారని.. బంగారం సంచిలో వేసుకోమని జాగ్రత్తలు చెప్పారు. వృద్ధులు అలాగే చేశారు. కొద్ది దూరం వెళ్లాక తిరిగి అదే వ్యక్తులు వృద్ధుల చేతిలోని సంచి లాక్కుని పరారయ్యారు. అందులో 3 తులాల బంగారు పుస్తెలతాడు, తులంన్నర గుండ్లు, రూ.2 వేలు నగదు, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డులు ఉన్నాయి. చోరీ విషయం కుటుంబీకులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు వాడిన బైక్‌కు నకిలీ నంబరు ప్లేటు ఉందని ఎస్సై తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని