Hyderabad: నటి డింపుల్ హయాతి ఇంట్లోకి ప్రవేశించిన యువతి, యువకుడు
సినీనటి డింపుల్ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు.

జూబ్లీహిల్స్: సినీనటి డింపుల్ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదంలో డింపుల్, డేవిడ్‌లపై కేసు నమోదైన విషయం విదితమే.
ఇదిలా ఉండగా, గురువారం ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువతి, యువకుడు సీ2లో ఉండే డింపుల్ నివాసంలోకి వెళ్లారు. పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఇంతలో ఇంట్లోని కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లారు. లిఫ్టు లోపలికి వారితో పాటు వెళ్లిన కుక్క తిరిగి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న డింపుల్ వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకుల్ని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. వారిని విచారించగా తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్ అభిమానులమని పేర్కొన్నారు. తాజాగా ఘటన నేపథ్యంలో ఆమెను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. విషయం ఆమెకు తెలియజేయగా, వారిని విడిచిపెట్టమని చెప్పారు. యువతీయువకులు కొప్పిశెట్టి సాయిబాబు, అతని బంధువు శృతిగా గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు