logo

రూ.3 కోట్ల వజ్రం రూ.30లక్షలకే అంటూ మోసానికి యత్నం

రూ.కోట్ల విలువైన వజ్రాన్ని రూ.లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. సౌత్‌వెస్ట్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. ముంబాయి, ఠాగూర్‌నగర్‌ విక్రిల్‌ ఈస్ట్‌ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తులేరే (48) మూడురోజుల క్రితం నగరానికి వచ్చాడు.

Updated : 29 Mar 2024 04:37 IST

నకిలీ వజ్రాన్ని చూపిస్తున్న డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: రూ.కోట్ల విలువైన వజ్రాన్ని రూ.లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. సౌత్‌వెస్ట్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. ముంబాయి, ఠాగూర్‌నగర్‌ విక్రిల్‌ ఈస్ట్‌ ప్రాంతానికి చెందిన బాలచంద్ర తులేరే (48) మూడురోజుల క్రితం నగరానికి వచ్చాడు. తనదగ్గర రూ.3కోట్ల విలువ చేసే వజ్రం ఉందని, రూ.30 లక్షలకే ఇస్తానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. పాతబస్తీ రియాసత్‌నగర్‌కు చెందిన ముస్తబా అహ్మద్‌ఖాన్‌, కంచన్‌బాగ్‌ హఫీజ్‌బాబానగర్‌ సి బ్లాక్‌ నివాసి సాజిద్‌ అలీలను సంప్రదించాడు. ముగ్గురు కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు. అనుమానంతో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. అక్కడికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు బృందం నిందితులను అరెస్టు చేసి, నకిలీ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. నిందితుల నేర చరిత్ర ఆరా తీస్తున్నట్లు డీసీపీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని