logo

అల్కాపురిలో ‘జీరో షాడో’ పరిశీలన

అల్కాపురిలో బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శంకర జయంతి మహోత్సవాల్లో గురువారం శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి శివ శూన్య ఛాయ(Zero Shadow)ను యంత్రాల ద్వారా పరిశీలించారు.

Published : 09 May 2024 21:20 IST

హైదరాబాద్‌: అల్కాపురిలో బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న శంకర జయంతి మహోత్సవాల్లో గురువారం శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి శివ శూన్య ఛాయ(Zero Shadow)ను యంత్రాల ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా శంకరమంచి మాట్లాడుతూ.. భూమి 23.5 డిగ్రీలు వంగి ఉన్న కారణంతో సూర్యుడి కాంతి (డిక్లినేషన్‌) 23.5 ఉత్తరం, 23.5 దక్షిణం మధ్య ఉంటుందన్నారు. సూర్యుడి డిక్లినేషన్ ఏ రోజైతే  మనం నివసించే ప్రాంతంలో అక్షాంశకు సమం అవుతుందో ఆరోజు మధ్యాహ్న సమయంలో సూర్యుడు మన ప్రాంతంలో సరిగ్గా 90 డిగ్రీల అల్టిట్యూడ్ వద్ద ఉంటాడని.. దీనివల్ల నిటారుగా ఉన్న వస్తువుల నీడ భూమిపై పడదని వివరించారు.  అందువల్లే  ఈరోజును శూన్య ఛాయా దినమని అంటామని తెలిపారు. సౌరశక్తి సంవత్సరం మొత్తంలో ఈరోజే ఎక్కువగా ఉంటుందన్న ఆయన.. ఈ శూన్య ఛాయను కర్కాటక రేఖ, మకరరేఖ మధ్య ఉన్న ప్రాంతాలలోనే గమనించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో నోరి నారాయణమూర్తి, రమేష్ గుప్త, అనంతలక్ష్మి, బంగారయ్యశర్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని