logo

బాచుపల్లి.. ఘటనలో ఐదుగురి అరెస్టు

బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్‌ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్‌ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం

Updated : 10 May 2024 05:42 IST

నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతపై విచారణకు హెచ్‌ఎండీఏ ఆదేశం

నిజాంపేట: బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్‌ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్‌ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం చెందగా మరో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన బాచుపల్లి పోలీసులు నిర్మాణ సంస్థ అధినేత వి.అరవింద్‌రెడ్డి(40), సైట్‌ ఇంజినీర్‌ ఎం.సతీష్‌కుమార్‌(28), ప్రాజెక్టు మేనేజర్‌ ఫ్రాన్సీస్‌ జేవీయర్‌రాజ్‌(53), గుత్తేదార్లు దడియాల రాజేష్‌ (42), అల్లు రాంరెడ్డి(28)లను అరెస్టు చేశారు. మరో గుత్తేదారు సింహాచలం పరారీలో ఉన్నట్లు సీఐ జె.ఉపేందర్‌ తెలిపారు. 1,999 చ. అ. విస్తీర్ణంలో సెల్లార్‌, స్టిల్ట్‌, ఐదు అంతస్తుల భవనాలకు 2021 జనవరి 22న అనుమతి పొందారు. నిర్మాణం జరుగుతున్న  406, 345, 403 సర్వే నంబర్ల భూములు ‘ఇండస్ట్రియల్‌ జోన్‌’లోకి వస్తాయి. అటువంటప్పుడు అనుమతులు ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నిర్మాణ సంస్థ ఎండీ అప్పటి రాష్ట్ర యువ మంత్రికి సన్నిహితుడు కావడంతోనే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు వచ్చాయనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.  ప్రహరీ కూలడంతో నిర్మాణంలో ఉన్న భవనాల నాణ్యతపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తూ హెచ్‌ఎండీఏ సంస్థ విచారణకు ఆదేశించింది. నాణ్యతపై నివేదిక ఇవ్వాలంటూ జేఎన్‌టీయూ సాంకేతిక విభాగానికి హెచ్‌ఎండీఏ లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని