logo

బీసీలు ఏకమై కాసానిని గెలిపించాలి

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు.

Published : 10 May 2024 03:28 IST

మాట్లాడుతున్న సబితా రెడ్డి, వేదికపై స్వామిగౌడ్‌,  ఆనంద్‌, కాసాని  

వికారాబాద్‌, న్యూస్‌టుడే: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌ పట్టణం, రామయ్యగూడలోని ఓ కల్యాణ మండపంలో వికారాబాద్‌ పట్టణ, మండల భారాస కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో దించామని, బీసీలంతా ఏకమై గెలిపించాల్సి అవసరం ఉందని అన్నారు. శాసనమండలి మాజీ సభాపతి స్వామిగౌడ్‌, భారాస జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌ మాట్లాడారు. ఎంపీపీ చంద్రకళ, భారాస మండల, పట్టణాధ్యక్షులు కమాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు రామస్వామి, అనంత్‌రెడ్డి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

కొడంగల్‌, దౌల్తాబాద్‌: మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం దౌల్తాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ హామీలన్ని నోటిమాటలే తప్ప ఆచరణ లేదన్నారు. భారాస హయాంలో సీఎం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. పాలమూరు లోక్‌సభ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని