logo

లోక్‌సభ బరి.. 17 మంది మహిళల గురి

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.

Updated : 10 May 2024 05:34 IST

ప్రధాన పార్టీల నుంచి ఇద్దరే

లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.

  • సికింద్రాబాద్‌ నుంచి మొత్తం 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. నలుగురు వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగగా.. మరో నలుగురు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.
  • హైదరాబాద్‌ లోక్‌సభ బరిలో నలుగురు మహిళలు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున మాధవీలత ప్రధాన పోటీదారుగా ఉన్నారు. విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి సామాజిక కార్యకర్త డాక్టర్‌ లుబ్నా సర్వత్‌ పోటీ చేస్తున్నారు. ఆమె 2014లో ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా) తరఫున కార్వాన్‌ అసెంబ్లీలో పోటీ చేశారు. ఆసిఫ్‌నగర్‌ కార్పొరేటర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు మరోసారి ఆమె ఎన్నికల బరిలో ఉన్నారు.

  • మల్కాజిగిరిలో 22 మంది పోటీ చేస్తుండగా.. ఇక్కడ ముగ్గురు మాత్రమే మహిళలు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈమె కాకుండా మరో ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నారు.
  • చేవెళ్ల నుంచి 43 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఒకరు గుర్తింపు పొందిన పార్టీ నుంచి.. మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు

సిటీ పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పురుషులు 11.25 లక్షల మంది ఉండగా..మహిళా ఓటర్లు 10.91 లక్షలు ఉన్నారు. సికింద్రాబాద్‌లో పురుష ఓటర్లు 10.86 లక్షలు ఉండగా.. 10.33 లక్షల మంది మహిళలు ఉన్నారు. చేవెళ్లలో 15.04 లక్షల మంది పురుష ఓటర్లు, 14.33 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. మల్కాజిగిరిలో 19.45 లక్షల మంది పురుష ఓటర్లు ఉండగా..18.33 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పురుషులు ఎక్కువగా నగరానికి వచ్చి ఇక్కడే ఓటును నమోదు చేసుకోవడంతో వీరి సంఖ్య స్వల్పంగా ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని