logo

మతం పేరిట కేసీఆర్‌ రాజకీయం చేయలేదు: కేటీఆర్‌

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 29 Mar 2024 06:05 IST

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో మాజీ ఎంపీ  బి.వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ  పేదవాడు ఏ మతమైనా మనిషిలా చూసి వారికి కావాల్సిన వసతులు అందించారని పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి కావాలన్నా, శాంతి రావాలన్నా కేసీఆర్‌ లాంటి నేత చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో జరిగిన పలువురు భారాస నాయకుల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, భారాస రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళ, భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఎం.డి.సత్తార్‌, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని