logo

నామినేషన్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది.

Published : 18 Apr 2024 02:48 IST

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్‌లో కర్నూలు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు, పాణ్యం అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. కర్నూలు నగరపాలకసంస్థ కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ అభ్యర్థులు, కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నామినేషన్‌ కేంద్రం వద్ద ఎస్సైతో సహా 25 మంది పోలీసులను నియమిస్తున్నారు. 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల వాహనాలు ఆపేయడం, అభ్యర్థితోపాటు బలపరిచే ఓటర్లను మాత్రమే నామినేషన్‌ కేంద్రాల్లోకి అనుమతించటం వంటి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని