logo

కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్‌పోస్టులు

కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్‌ సరైలైన్స్‌ టీమ్‌లతో కూడిన చెక్‌పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్‌ భార్గవ్‌తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 18 Apr 2024 02:49 IST

నిరంతరం నిఘా

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్‌ సరైలైన్స్‌ టీమ్‌లతో కూడిన చెక్‌పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్‌ భార్గవ్‌తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర శివారులోని సుంకేసుల రోడ్డులో కార్తీక్‌ ఆసుపత్రి వద్ద ఒకటి, జొహరాపురం వై-జంక్షన్‌ వద్ద మరొకటి, నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇంకొకటి ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చెక్‌పోస్టులో ముగ్గురు వేర్వేరు శాఖ అధికారులు, తొమ్మిది మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్‌ స్థాయి పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు మూడు బృందాలుగా విడిపోయి ప్రతి 8 గంటలకు ఒక బృందం చొప్పున మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఒక బృందం, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంట వరకు మరో బృందం, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మరో బృందం పనిచేస్తుంది. వాహనాలను తనిఖీ చేసి అక్రమంగా తరలించే మద్యం, నగదు, వస్తువులను గుర్తించాల్సి ఉంటుంది. భారీ మోతాదులో నగదు పట్టుబడితే ఆదాయపన్ను శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. చెక్‌పోస్టులో అప్రమత్తంగా లేకపోయినా.. విధులకు గైర్హాజరైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని