logo

తాగు, సాగునీరు అందించే నాయకులకే ఓట్లు వేయాలి

కౌతాళం మండలం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య పరంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమని, ప్రజలకు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పి ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంచేసి కనీసం తాగునీరు, సాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి నాయకులు కల్పించడం దురదృష్టకరమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.మల్లయ్య అన్నారు.

Updated : 20 Apr 2024 15:56 IST

కౌతాళం: కౌతాళం మండలం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్య పరంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన ప్రాంతమని, ప్రజలకు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పి ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యంచేసి కనీసం తాగునీరు, సాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి నాయకులు కల్పించడం దురదృష్టకరమని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.మల్లయ్య అన్నారు. రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలానికి తాగనీరు, సాగునీరు, విద్యుత్ కొరత, రైతు సమస్యలు తీర్చే వారికే ఓట్లు వేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశులు, ఈరన్న, రైతు సంఘం నాయకులు ఉలిగయ్య, రామాంజనేయులు, నాగరాజు, మారయ్య, తాయన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని