logo

అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా

రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 23 Apr 2024 03:10 IST

నంద్యాల వైకాపా స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డి

విజయవాడ (గాంధీనగర్‌), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. తాను గత 14 ఏళ్లుగా వైకాపా కార్యకర్తగా పని చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రంగా, గోప్యంగా ఉండాల్సిన రాష్ట్ర ప్రజల డేటా.. అంగట్లో సరకులా మారిందన్నారు. అందరికన్నా ముందుగా డేటా లీక్‌ను గుర్తించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, అయినా ఆయన నుంచి స్పందన లేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని