logo

ఇస్మాయిల్, దస్తగిరయ్య దర్గా ఉత్సవాలు ప్రారంభం

మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామంలో కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే ఇస్మాయిల్, దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 16 Apr 2024 17:16 IST

రాజోలి: మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామంలో కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే ఇస్మాయిల్, దస్తగిరయ్య ఉర్సు ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలో రాములవారి కల్యాణం నిర్వహించిన భక్తులంతా సీతారాముల ఆలయ సమీపంలోని ఇస్మాయిల్ దర్గా గంథోత్సవంలో పాల్గొంటారు. రాత్రి గంధోత్సవంలో భాగంగా స్వామివారి గంధాన్ని బ్యాండు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించనున్నట్లుగ °గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉర్సు ఉత్సవం, శుక్రవారం కిస్తీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని