logo

పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

మహబూబ్‌నగర్‌కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్‌ కథనం ప్రకారం..

Published : 18 Apr 2024 04:07 IST

మంటల్లో 90 శాతం కాలిపోయిన శరీరం

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ గాంధీనాయక్‌, ఎస్సై విజయ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్‌ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ శివారులోని మయూరి పార్కులో బుధవారం మధ్యాహ్నం పర్యాటకులు తిరిగే చెరువు కుంట సమీపంలో పొగలు వచ్చాయి. గమనించిన పార్కు సిబ్బంది అక్కడి అడవికి నిప్పు అంటుకుందని భావించి మంటలు ఆర్పివేసేందుకు వచ్చారు. అక్కడ గుర్తించడానికి కూడా వీల్లేని విధంగా మంటల్లో 90 శాతం కాలిపోయిన యువతి మృతదేహం కనిపించింది. సిబ్బంది సమాచారంతో అటవీ శాఖ అధికారులు వచ్చి పరిశీలించి గ్రామీణ ఠాణా పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఇది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్‌ఫోన్‌ కూడా మంటల్లో కాలిపోయింది. మరణించిన యువతి వయస్సు 22-25 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద స్టీల్‌ వాటర్‌ బాటిల్‌, చెప్పులు, ఒంటిపై చెవి రింగులు, గొలుసు (బంగారానివి కావు) లభించాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. యువతి ఎవరో గుర్తించలేకపోయామని, అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

మృతదేహం సమీపంలో లభించిన నీటి సీసా, చెప్పులు తదితరాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని