logo

రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు

జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు

Published : 20 Apr 2024 01:56 IST

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రవి మహదవ్‌స్వామి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సంగారెడ్డిలో రిటర్నింగ్‌ అధికారి వల్లూరు క్రాంతికి అందజేశారు. న్యాల్‌కల్‌ మండలం వడ్డి గ్రామానికి చెందిన కమ్మరి ఆనందీశ్వర్‌, రాయికోడ్‌ మండలానికి చెందిన బిరాదర్‌ మారుతీరావు ఒక్కో సెట్‌ చొప్పున   నామపత్రాలు సమర్పించారు. వీరిందరూ స్వతంత్ర అభ్యర్థులే. నామినేషన్ల దాఖలుకు వచ్చే వారికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది సహకరిస్తున్నారు. జతచేయాల్సిన పత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో ఉంచడంతో పాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌  చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

మెదక్‌లో నాలుగు..

 మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రెండో రోజైన శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్‌కుమార్‌, తుమ్మలపల్లి పృథ్వీరాజ్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది నామినేషన్లు వేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని