logo

ఇంతి పాత్ర అంతంతే..!

ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్‌సభకు పంపలేదు.

Updated : 18 Apr 2024 06:12 IST

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్‌సభకు పంపలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు వారిని ఆకర్షించే పథకాలను, హామీలను ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి కానీ మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు 1952 నుంచి 2019 వరకు నల్గొండ ఎంపీ స్థానానికి 18 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారు. 1962లో ఏర్పాటైన మిర్యాలగూడ ఎంపీ నియోజకవర్గం 2004లో రద్దయ్యే వరకు 12 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారు. 2009లో భువనగిరి నియోజకవర్గం ఏర్పాటైంది. ఇక్కడ మూడు పర్యాయాలు ఎంపీ పదవికి ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలు మహిళా అభ్యర్థులను ఎంపిక చేయకపోయినా సీపీఎం ముందడుగు వేసింది. మిర్యాలగూడ నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యాన్ని 1996లో బరిలో నిలిపింది. ఆమె వారసురాలిగా నల్గొండ ఎంపీ స్థానానికి 2019లో సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి పోటీలో నిలిచారు. వారికి గణనీయమైన ఓట్లు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని