logo

ఒక్క ఎంపీ స్థానం.. ఐదు జిల్లాలు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2007లో ఈ స్థానం నూతనంగా ఏర్పడింది.

Published : 22 Apr 2024 06:03 IST

రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2007లో ఈ స్థానం నూతనంగా ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, వరంగల్‌ నుంచి జనగామ శాసనసభ నియోజకవర్గాలతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడుతో పాటు భువనగిరి, ఆలేరు సెగ్మెంట్‌లు ఇందులో ఉన్నాయి. మొత్తంగా ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని భువనగిరి లోక్‌సభ పరిధిలో 18,04,930 ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 8,96,219 మంది ఉండగా మహిళా ఓటర్లు 9,08,632 మంది, ఇతరులు 79 మంది ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గం అంతకుమునుపు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండేది. ఇబ్రహీంపట్నంతో పాటు హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మంచాల, యాచారం మండలాలున్నాయి.

జనగామ: ఇది నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రం. నియోజకవర్గం పరిధిలో చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, జనగామ, మద్దూరు, తరిగొప్పుల, కొమురవెల్లి, ధూల్మిట్ట మండలాలున్నాయి. 

నకిరేకల్‌: గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుమారు 2,21,453 ఓట్లున్నాయి. నకిరేకల్‌, చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి, రామన్నపేట, నార్కట్‌పల్లి మండలాలున్నాయి.
మునుగోడు : ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. మునుగోడు, సంస్థాన్‌ నారాయణపురం, మర్రిగూడ, చండూరు, నాంపల్లి, చౌటుప్పల్‌, గట్టుప్పల్‌ (నూతన మండలం) మండలాలున్నాయి.
తుంగతుర్తి : జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని చేర్చారు. తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, శాలిగౌరారం, మోత్కూరు, అడ్డగూడూరు, నూతనకల్‌, మద్దిరాల మండలాలున్నాయి.
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న ఈ నియోజకవర్గంలో భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, భూదాన్‌ పోచంపల్లి మండలాలున్నాయి.
ఆలేరు: ఇందులో మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తుర్కపల్లి, గుండాల, బొమ్మల రామారం, ఆత్మకూర్‌(ఎం), మోటకొండూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని