logo

ముప్పు తప్పేలా సన్నద్ధత

జిల్లాలో రోజు వందల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. రెండు దశలతో పోలిస్తే అంతగా ప్రమాదకరం కాకపోయినా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా జనరల్‌ ప్రభుత్వ

Published : 20 Jan 2022 02:40 IST

కొవిడ్‌ చికిత్సకు మెరుగైన వసతులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని వెంటిలేటర్లు చూపుతున్న సిబ్బంది

జిల్లాలో రోజు వందల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. రెండు దశలతో పోలిస్తే అంతగా ప్రమాదకరం కాకపోయినా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా జనరల్‌ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పీహెచ్‌సీల వరకు అన్నింట్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందించేలా తీర్చిదిద్దారు.
గ్రామస్థాయిలో..
వేల్పూర్‌, బాల్కొండ పీహెచ్‌సీలతో పాటు మోర్తాడ్‌ సీహెచ్‌సీని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి మెరుగ్గా తీర్చిదిద్దారు. వేల్పూర్‌లో 6 ఐసీయూ, 8 ఆక్సిజన్‌, బాల్కొండలో 10 ఐసీయూ, 20 ఆక్సిజన్‌, మోర్తాడ్‌లో 30 ఆక్సిజన్‌, 10 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మోర్తాడ్‌ సీహెచ్‌సీలో ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌తో పాటు బాటిలింగ్‌ యూనిట్‌ను నెలకొల్పారు.

* జిల్లాలోని 8 సీహెచ్‌సీల్లో 30 ఆక్సిజన్‌ పడకలు, రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఉంచారు. 22 పీహెచ్‌సీల్లో ఐదు పడకలు చొప్పున ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధంగా ఉంచారు.

* కొవిడ్‌ బాధితులు బయట ఎక్కడా తిరిగే అవసరం లేకుండా ప్రతి ఉప కేంద్రంలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన ఔషధాల కిట్లు సరఫరా చేశారు. ఆశాలకు సమచారం ఇచ్చినా కిట్లను ఇంటికే చేర్చేలా ఏర్పాటు చేశారు.

* పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ రెండు చొప్పున కాన్సంట్రేటర్లు ఉంచారు.
కార్పొరేట్‌ స్థాయిలో..
జిల్లా కేంద్రంలోని దవాఖానాలో కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. 747 ఆక్సిజన్‌, 224 ఐసీయూ పడకలు, 6 వేల లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌తో పాటు వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంట్‌ సిద్ధం చేశారు. చికిత్సలో అవసరమయ్యే అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చారు.
బోధన్‌, ఆర్మూర్‌లో..
బోధన్‌ వైద్యశాలలో కొవిడ్‌ రోగుల కోసం 100 ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటు చేశారు. నాలుగు వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీయూ పడకలు సిద్ధం చేస్తున్నారు. ఆర్మూర్‌ సీహెచ్‌సీలోనూ 100 ఆక్సిజన్‌ పడకలకు తోడు ఐసీయూ సదుపాయం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని