logo

502 పాజిటివ్‌ కేసులు

జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో సోమవారం 1563 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 502 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు.

Published : 25 Jan 2022 03:12 IST

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో సోమవారం 1563 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 502 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు.

9,912 మందికి టీకాలు

నిజామాబాద్‌ వైద్యవిభాగం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సోమవారం 9,912 మందికి టీకాలు వేశారు.

రుద్రూర్‌లో ఏడుగురికి..

రుద్రూర్‌ : రుద్రూర్‌ పీహెచ్‌సీలో సోమవారం 16 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారి దిలీప్‌కుమార్‌ తెలిపారు. రుద్రూర్‌లో 4, అక్బర్‌నగర్‌లో 2, బొప్పాపూర్‌లో ఒక కేసు నమోదైందని చెప్పారు.

ఆర్మూర్‌లో 22 మందికి..

ఆర్మూర్‌ పట్టణం: ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం 58 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు సూపరిండెంటెంట్‌ నాగరాజు తెలిపారు.

45 మందికి ...

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : బోధన్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమవారం 115 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా 45 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇటీవల నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. పరీక్షల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎడపల్లిలో 8

ఎడపల్లి, న్యూస్‌టుడే: ఎడపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా నిర్ధారణైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని